రైల్వే కొత్త విధానం: ఒకే టైమ్ లో డబుల్ గూడ్స్ ట్రాన్ పోర్ట్

రైల్వే కొత్త విధానం: ఒకే టైమ్ లో డబుల్ గూడ్స్ ట్రాన్ పోర్ట్

న్యూఢిల్లీ : లాక్ డౌన్ టైమ్ లో గూడ్స్ ట్రాన్ పోర్ట్ ను వేగవంతం చేసేందుకు ఇండియన్ రైల్వే కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. ఒకే టైమ్ లో డబుల్ గూడ్స్ ను ట్రాన్ పోర్ట్ చేసేందుకు రెండు రైళ్లను క్లబ్ చేస్తోంది. ఈ విధానంలో రెండు రైళ్ల స్థానంలో ఒకే రైలు ద్వారా సరకు రవాణా చేయగలుగుతుంది. రెండు గూడ్స్ బోగీల్లో వేర్వేరు స్టేషన్ల నుంచి సరుకు లోడ్ చేస్తోంది. ఆ తర్వాత సమీపంలోని ఒక స్టేషన్ వద్ద ఈ రెండు రైళ్లను క్లబ్ చేస్తోంది. అక్కడి నుంచి కామన్ జంక్షన్ పాయింట్ కు గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో ఒక్కో సరకు కు ఒక్కో చోటు నుంచి రైళ్లను నడుపకుండా సమీపంలోని స్టేషన్ వద్దకు రెండు రైళ్లను తేవటంతో చాలా ఖర్చు ఆదా అవుతోందని రైల్వే అధికారులు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించారు. సాధారణంగా 15 రోజుల్లో 1.29 మిలియన్ టన్నుల గూడ్స్ రవాణా చేస్తే…లాక్ డౌన్ పిరయడ్ లో గత 15 డేస్ లో 3.20 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేయగలిగమని చెప్పారు. భవిష్యత్ లోనూ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ లో ఇదే విధానాన్ని అమలు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.