రేపటి నుంచి రైల్వేలో ఈ-టికెట్లపై సర్వీస్‌ ఛార్జీలు 

రేపటి నుంచి రైల్వేలో ఈ-టికెట్లపై సర్వీస్‌ ఛార్జీలు 

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు.. ఆర్ధిక వనరులు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. ఇందులో భాగంగా ఈ-టికెట్లపై సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

ఈ-టికెట్లపై సర్వీస్‌ ఛార్జీని సెప్టెంబర్‌ 1 నుంచి వసూలు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. నాన్‌  AC టికెట్లకు 15 రూపాయిలు, AC టికెట్లకు రూ.30 వసూలు చేయనున్నారు. దీనికి అదనంగా GSTని కూడా వసూలు చేయనున్నారు రైల్వే అధికారులు.