పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు

పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తు్న్న దంపతులపై నలుగురు గుర్తుతెలియని దుండగులు దారిదోపిడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం బరేలీలోని షాహీ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంకా సమీపంలో చోటుచేసుకుంది.

బీర్ పూర్ బకేనియాలో నివాసముంటున్న రాజ్ కుమార్ తన భార్య హేమలతతో శిష్ గఢ్ వెళ్లి వస్తున్నాడు. రోడ్డుపై వారిని నలుగురు ఆపి పక్కకు లాగా దోచుకోవడానికి ప్రయత్నించారు. భర్తను కొడుతున్నారని అడ్డుకోబోయిన హేమలతను తుపాకీతో కాల్చి చంపారు. రాజ్ కుమార్ కి కూడా గాయాలు అయ్యాయి. గ్రామస్థులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి వారిని హాస్పిటల్ కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.