భారీ వర్షాలకు వణికిపోతున్న రాష్ట్రాలు

భారీ వర్షాలకు వణికిపోతున్న రాష్ట్రాలు

ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న కూడా అసోంలు భారీ వర్షాలు పడ్డాయి. వరదల ప్రభావానికి ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. మొత్తం 5 లక్షల మందికి పైగా అసోం ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. అసోంలోని పరిస్థితులపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్, పాలక్కడ్, మలప్పురం, త్రిశూర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. రానున్న 5 రోజులపాటు కేరళలో భారీ వర్షాలు పడే అవకాశముందంది వాతావరణ శాఖ. కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు వణికిపోయింది. బెంగళూరులో కాల్వలు నిండిపోయాయి. రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వాహన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో 4 అడుగుల మేర నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఏపీలోని కృష్ణా జిల్లా ప్రజలు వారం రోజులుగా తీవ్ర ఎండలకు అల్లల్లాడిపోతున్నారు. ఇవాళ ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. గుడివాడలో ఉదయం నుంచి తేలికపాటి వర్షం పడుతుంది.

 

మరిన్ని వార్తల కోసం...

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు

మరోసారి రెండువేలకు పైగా కరోనా కేసులు