కోల్ కతాపై రాజస్థాన్ ఉత్కంఠ విజయం

కోల్ కతాపై రాజస్థాన్ ఉత్కంఠ విజయం

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ లో రాజస్థాన్‌‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. లోయరార్డర్‌ తో కలిసి యంగ్​గన్‌‌ రియాన్‌‌ పరాగ్‌ (31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో47), జొఫ్రా ఆర్చర్‌ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స-ర్లతో 27 నాటౌట్‌ ) మెరుపు బ్యాటింగ్‌ తో గురువారం జరిగిన మ్యాచ్‌ లో రాయల్స్‌ 3 వికెట్లతో కోల్‌‌కతాపై గెలిచింది. మరో వైపు వరుసగా ఆరు ఓటములతో నైట్‌ రైడర్స్‌ నాకౌట్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది .టాస్‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌ చేసిన నైట్‌ రైడర్స్‌ 20 ఓవర-్లలో ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దినేశ్‌ కార్తీక్‌‌(50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 97నాటౌట్‌ ) ఒంటరి పోరాటం చేశాడు. వరుణ్‌ ఆరోన్‌‌ రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌ లో రాయల్స్‌ 19.2ఓవర్లలో ఏడు వికెట్లకు 177 రన్స్‌ చేసి గెలిచింది. రియాన్‌‌, ఆర్చర్‌ తో పాటు రహానె(34) కూడా రాణించాడు.

రియాన్‌ , ఆర్చర్సూపర్
​ఛేజింగ్‌ లో రాయల్స్‌ కు అదరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్‌ కు 31 బంతుల్లో 53 రన్స్‌ జోడించిన ఓపెనర్లు అజింక్య రహానె(34), సంజుశాంసన్‌‌(22) విజయానికి బలమైన పునాది వేశారు.అయితే జోరుగా సాగుతున్న రాయల్స్‌ ఇన్నింగ్స్‌ కు నరైన్‌‌ బ్రేకులేశాడు. ధాటిగా ఆడుతున్న రహానె..నరైన్‌‌ బౌలింగ్‌ లో ఎల్బీ అయ్యాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్‌‌ వికెట్‌ నస్టానికి 55పరుగులు చేసింది. ఏడో ఓవర్‌ లో బంతిని అందుకున్న పియూష్‌‌ చావ్లా మరో ఓపెనర్‌ శాంసన్‌‌ను బౌల్డ్‌చేశాడు. తర్వాతి ఓవర్‌ లో మళ్లీ బంతిని అందుకున్న నరైన్‌‌.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (2)ను బౌల్డ్‌చేసి రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.

ఆతర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్‌‌(47 ) ఇచ్చినరిటర్న్‌‌ క్యాచ్‌ ను నరైన్‌‌ అందుకోలేక పోవడంతోఅతను బతికిపోయాడు. రియాన్‌‌తో కలిసి కాసేపుజాగ్రత్తగా ఆడిన బెన్‌‌ స్టోక్స్‌ (11) కూడా తక్కువస్కోరుకే ఔటయ్యాడు. చావ్లా వేసిన 11వ ఓవర్‌ లో స్టోక్స్‌ భారీ షాట్‌ ఆడగా లాంగాన్‌‌లో ఉన్న రసెల్‌‌ బౌండరీ లైన్‌‌ వద్ద అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. 13వ ఓవర్‌ లో స్టువర్ట్‌‌ బిన్నీ(11)ని చావ్లా ఔట్‌ చేయడంతో కోల్‌‌కతా విజయం ఖాయమనిపించింది. అయితే రాణా బౌలింగ్‌ లో హ్యాట్రిక్‌‌ ఫోర్లు కొట్టి రాయల్స్‌ శిబిరంలో ఆశలు రేపిన గోపాల్‌‌(18)ను ప్రసిధ్‌ ఔట్‌ చేశాడు. అయితే ఆర్చర్‌ తో కలిసి బండిని నడిపించిన రియాన్‌‌ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్‌విజయానికి 18 పరుగులు దూరంలో నిలిచింది .రసెల్‌‌ వేసిన 19వ ఓవర్‌ లో సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెం చరీకిచేరువైన రియాన్‌‌ హిట్‌ వికెట్‌ గా వెనుదిరిగాడు. విజయానికి ఆఖరి ఆరు బంతుల్లో 9 పరుగులు కావాల్సిఉండగా ప్రసిధ్‌ బౌలింగ్‌ లో వరుసగా 4, 6 కొట్టినఆర్చర్‌ రాజస్థాన్‌‌కు విజయం అందించాడు.

వరుణ్కట్టడి.. కార్తీక్కమాల్
కోల్‌‌కతా ఇన్నింగ్స్‌ ఆరంభానికి ఫినిషింగ్‌ కు పొంతనేలేదు. రాయల్స్‌ పేసర్‌ వరుణ్‌ ఆరోన్‌‌(2/20)దెబ్బకు తొలి ఐదు ఓవర్లలోనే ఓపెనర్లను కోల్పోయిన కోల్‌‌కతా ఇన్నింగ్స్‌ ను పేలవంగా మొదలుపెట్టింది . మూడో బాల్‌‌కే ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌‌(0) క్లీన్‌‌బౌల్డ్‌ అవగా.. శుభ్‌ మన్‌‌గిల్‌‌(14) నిరాశ పరిచాడు. కాసేపు పోరాడిన నితీశ్‌ రాణా(21)ను గోపాల్‌‌ పెవిలియన్‌‌ చేర్చడంతో పది ఓవర్లకు కోల్‌‌కతా49/3తో పీకల్లతో కష్టాల్లో పడింది . ఈ దశలో మిడిలార్డర్‌ లో బ్యాటింగ్‌ కు వచ్చిన సునీల్‌‌ నరైన్‌‌(11)తో కలిసి దినేశ్‌ కార్తీక్‌‌ ఇన్నింగ్స్‌ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పటిదాకా ఆచితూచి బ్యాటింగ్‌చేసిన డీకే.. గోపాల్‌‌ వేసిన 11వ ఓవర్లో 6, 4, 4,4తో ఊపులోకి వచ్చేశాడు. ఆఖరి బంతికి సునీల్‌‌ నరైన్‌‌ సిక్స్‌ కొట్టడంతో హోమ్‌ టీమ్‌ ఇన్నింగ్స్‌ వేగం పెరిగింది. కానీ, తర్వాతి ఓవర్లోనే ఆరోన్‌‌ చురుకైన ఫీల్డింగ్‌ కు నరైన్‌‌ రనౌటయ్యాడు.

ఆండ్రీ రసెల్‌‌(14)వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. రెండు సార్లు లైఫ్‌ వచ్చినా సద్వనియోగం చేసుకోలేక తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కానీ, కార్తీక్‌‌  ఏదశలోనూ పోరాటం ఆపలేదు. ఆరోన్‌‌ వేసిన 14వ ఓవర్‌ లో 6, 4 కొట్టినకార్తీక్‌‌ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. ఉనాద్కట్‌ బౌలింగ్‌ లో మరో సిక్సర్‌ రాబట్టాడు. ఇదే జోరుతో35 బంతుల్లోనే డీకే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో రసెల్‌‌ ఔటైనా.. లాస్ట్‌‌ బాల్‌‌ను సిక్సర్‌ గా మలచిన దినేశ్‌ .. చివరి మూడు ఓవర్లలోమరింత విజృంభించాడు. ఉనాద్కట్‌ బౌలింగ్‌ లోబౌం డ్రీ కొట్టిన బ్రాత్‌ వైట్‌ (5) తర్వాతి బాల్‌‌కే ఔటైనా.. డీకే వెనక్కుతగ్గలేదు. ఆ ఓవర్లో రెండుఫోర్లు బాదిన అతను.. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్‌ లో రెండు సిక్సర్లు బాది స్కోరు 150 దాటించాడు. ఆపై, ఉనాద్కట్‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్‌ లో ఓ ఫోర్‌ , రెండు సిక్సర్లతో రెచ్చి పోయిన కార్తీక్‌‌  ఇన్నింగ్స్‌ కు ఫినిషింగ్‌ టచ్‌ఇచ్చాడు.