పుట్టబోయే బిడ్డపై ఉపాసన ఎమోషనల్ ట్వీట్

పుట్టబోయే బిడ్డపై ఉపాసన ఎమోషనల్ ట్వీట్

అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు సాంగ్ కు  అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ , రాంచరణ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో రాంచరణ్ భార్య ఉపాసన చీరకట్టులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ  గురించి  మొదటి సారి ట్విట్టర్లో స్పందించారు. 

ఆర్ఆర్ఆర్ లోని ఫోటోలను షేర్ చేసిన ఉపాసన చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆర్ఆర్ఆర్ టీంలో  తాను భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ జర్నీలో తాను భాగమయ్యేలా చేసిన రాజమౌళి, చరణ్ లకు  ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు తన బిడ్డ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.