పవన్ కుమ్మేశాడు.. కెరీర్లోనే ఇది బెస్ట్.. ఓజీపై వర్మ కామెంట్స్

పవన్ కుమ్మేశాడు.. కెరీర్లోనే ఇది బెస్ట్.. ఓజీపై వర్మ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG)పై రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా ఓజీ మూవీ నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ అదరగొట్టేశారు. గ్లింప్స్ చుసిన పవన్ ఫ్యాన్స్ ఫిదా ఐపోతున్నారు. కనబడితే దర్శకుడు సుజీత్ కు గుడి కట్టేసేలా ఉన్నారు. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ను ప్రెసెంట్ చేశారు సుజీత్. 

ఇక తాజాగా ఈ గ్లింప్స్ పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. గ్లింప్స్ అదిరిపోయింది అంటూ పాజిటీవ్ కామెంట్స్ చేశాడు... ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది నేను ఇప్పటి వరకు చూసిన పవన్ కళ్యాణ్ ట్రైలర్స్‌లో ఇది బెస్ట్. హేయ్ సుజిత్ చంపేశారు బ్రో.. అంటూ రాసుకొచ్చారు వర్మ. ప్రస్తుతం ఓజీ గ్లింప్స్ పై వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Also Read :- మాస్ రాజా టోక్యో ట్రిప్.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్

ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే..  ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్న సినిమాలో.. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీ రోల్స్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.