ఆశ పుట్టించాయి!

ఆశ పుట్టించాయి!

ఈ పులి కూనల పుట్టుక చాలా స్పెషల్​. ఒకటి కాదు.. రెండు కాదు.. 20 ఏళ్ల తర్వాత బ్రిటన్​లోని విల్షైర్​ లాంగ్​లీట్​ సఫారీ పార్క్​లో ‘యానా’ అనే పులికి పుట్టాయివి. యానాకు ఇదే మొదటి ఈత. ఆ రెండు పిల్లల్లో ఒకటి ఆడపులి కాగా, ఇంకోటి మగది. పుట్టినప్పుడు ఒక్కోటి 900 గ్రాముల బరువున్నాయి. ప్రస్తుతం వాటికి పాలు మాత్రమే పడుతున్నారు. 6 నుంచి 8 వారాల తర్వాత మాంసం పెట్టనున్నారు సఫారీ పార్క్​ సిబ్బంది. రష్యా, చైనాల్లో మాత్రమే ఉండే ఈ సైబీరియన్​/అముర్​ పులులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరాయి. ప్రపంచం మొత్తం వెతికినా 540కి మించి లేవు. 1930ల్లో వేట కారణంగా వాటి సంఖ్య కేవలం 20 నుంచి 30 వరకే ఉన్నాయి. అప్పటి నుంచి వాటిని సంరక్షించడానికి చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పటికి అవి 540కి పెరిగాయి. ఇప్పుడు యూరోపియన్​ వైడ్​ బ్రీడింగ్​ ప్రోగ్రామ్​ కింద వాటి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.