వరుడు కావలెను

వరుడు కావలెను

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ‘దిగు దిగు దిగు నాగ’ అనే పాటను నిన్న రిలీజ్ చేశారు. తమన్‌‌‌‌ క్యాచీ ట్యూన్‌‌‌‌కి అనంత శ్రీరామ్‌‌‌‌ చక్కని లిరిక్స్ రాశాడు. ‘నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో.. నాపగడ్డి సేలగాడ నాకేట్టి పనిరో.. సందాల సంతగాడ నాకేట్టి పనిరో.. సాకిరేవు తగువుగాడ నాకేట్టి పనిరో’ అంటూ సాగే ఈ పాటను రీతూపై తీశారు. శ్రేయాఘోషల్ పాడిన విధానం చెవులకు ఇంపుగా ఉంటే.. వింటేజ్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఉన్న రీతూ, శేఖర్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కంపోజ్ చేసిన స్టెప్స్‌‌‌‌ వేస్తూ కళ్లకు విందు చేసింది. పల్లెటూరి జానపదాల స్టైల్లో ఉన్న ఈ పాట పిక్చరైజే షన్​ ఆకట్టుకుంది. సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. కథ, కథనం, డైలాగ్స్, సాంగ్స్‌‌‌‌ అన్నీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తాయని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.