దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా.. నిఫ్టీ 240 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే.. రూపాయి మారకం విలువ 80.02 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ సూచీలో అన్ని షేర్లునష్టాల్లోనే ఉన్నాయి. కీలక వడ్డీ రేట్లు పెంచుతామని.. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన సూచీలపై ప్రభావం పడింది.
Rupee hits record low of 80.11 against the previous session close of 79.87 on Friday (26th Aug)
— ANI (@ANI) August 29, 2022
(Representative image) pic.twitter.com/JGNcyHnczJ
శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒపెక్ చమురు ఉత్పత్తిని తగ్గించుకుంటామన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 102 డాలర్లకు పెరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ మీటింగ్ పై ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏర్పడింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 5 జీ సేవలు, ఫోన్ పై వివరాలు తెలుపుతారని భావిస్తున్నారు.
