బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నాలుగో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ నష్టపోయాయి

బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నాలుగో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ నష్టపోయాయి

ముంబై: బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు వరసగా నాలుగో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ నష్టపోయాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా బేరిష్ ట్రెండ్ కొనసాగడంతో దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు సోమవారం భారీగా క్రాష్ అయ్యాయి.  వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు వడ్డీ రేట్లను పెంచుతుండడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకుంటుందనే భయాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు వెనకడుగేస్తున్నారు. సెన్సెక్స్ సోమవారం  954 పాయింట్లు (1.64 శాతం) నష్టపోయి 57,145 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 311 పాయింట్లు తగ్గి 17,016 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2,600 పాయింట్లు పడగా,  ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.13.30 లక్షల కోట్లు  తగ్గింది.   డాలర్ వాల్యూ పెరుగుతుండడం, గ్లోబల్ ఎకానమీ గ్రోత్ స్లో అవుతుండడంతో  ఇన్వెస్టర్లు  జాగ్రత్త వహిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.  దీంతో  దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు భారీగా పడ్డాయని, రూపాయి విలువ తగ్గిందని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఐటీ షేర్లు అధ్వాన్నంగా కదిలాయని వివరించారు. కాగా, సోమవారం బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 3.33 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 2.84 శాతం క్రాష్ అయ్యాయి.  సెక్టార్ల పరంగా చూస్తే బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐటీ, రియల్టీ, ఆటో, యుటిలిటీస్‌‌‌‌‌‌‌‌, పవర్, కమొడిటీస్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా నష్టపోయాయి. మొత్తం 2,925 షేర్లు సోమవారం నష్టాల్లో క్లోజయ్యాయి. సియోల్‌‌‌‌‌‌‌‌, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో ముగిశాయి. యూరప్‌‌‌‌‌‌‌‌లోని మెజార్టీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నెగెటివ్‌‌‌‌‌‌‌‌లో కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 0.75 శాతం తగ్గి 85.50 డాలర్లుగా పలుకుతోంది. 

హర్ష ఇంజినీర్స్‌‌‌‌‌‌‌‌ షేర్లు అదుర్స్‌‌‌‌‌‌‌‌..

హర్ష ఇంజినీర్స్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్ షేర్లు సోమవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌లు బంపర్ బోణి చేశాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.330 తో పోలిస్తే 36 శాతం ఎక్కువకు అంటే రూ. 450 వద్ద ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో లిస్టింగ్ అయ్యాయి. బీఎస్‌‌‌‌‌‌‌‌ఈలో 35 శాతం ఎక్కువతో రూ. 444 వద్ద లిస్టింగ్ అయ్యాయి. అక్కడి నుంచి ఇంట్రాడేలో రూ. 485 వరకు వెళ్లిన ఈ కంపెనీ షేర్లు, ఇష్యూ ధర కంటే 46 శాతం లాభంతో రూ.482 వద్ద క్లోజయ్యాయి.