ఢిల్లీలో పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు దుండగులు. ఆదివారం (మే 12) మధ్యాహ్నం ఢిల్లీలోని బురారి, సంజయ్ గాంధీ మెమోరియల్ఆస్పత్రులకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమ్తతమయ్యారు. బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందితో బాంబు బెదిరింపులు వచ్చి ఆస్పత్రుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ డివైజ్ లు గానీ దొరకలేదన ఢిల్లీ నార్త్ డీసీపీ మనోజ్ మీను తెలిపారు. 

ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీలోని బురారి ఆస్పత్రికి తొలుత బెదిరింపు ఈమెయిల్ష వచ్చాయి. అనంతర సాయంత్రం 4.26 గంటలకు సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి బాంబు పెట్టామంటూ రెండో కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు రెండు ఆస్పత్రుల వ్దద సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

ఇటీవల ఢిల్లీ, అహ్మదాబాద్ లలో ఇలాంటి బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఢిల్లీ ఎన్ సీఆర్ లోని 130 కి పైగా స్కూళ్లలో పేలుడు పదార్ధాలు ఉన్నాయని ఒకరకమైన ఈమెయిల్స్ పంపించారు దుండగులు.  ఈ బెదిరింపులు ఢిల్లీ వాసులను భయాందోళనకు గురి చేశాయి. పోలీసులు అలర్ట్ అయి విద్యార్థులను తరలించడం, స్కూళ్లలో తనఖిలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు వస్తువులు గానీ, అనుమానాస్పద వస్తువులుగానీ లభించలేదు.