తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. 

సమస్యాత్మకమైన ప్రాంతాల్లో రెండంచల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. పోలింగ్ ముగిసే వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారన్నారు. 

జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాతో పాటు..డబ్బు రవాణాపై నిఘా ఉంటుందన్నారు స్టేట్ పోలీసులు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాలు మద్యం సీజ్ చేశామని ప్రకటించారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు బుక్కయ్యాయని చెప్పారు.