
పెళ్లైనా.. కాకపోయినా.. ఆడ, మగ సహజీవనం చేయడం తప్పు కాదని న్యాయస్థానాలే తీర్పులిస్తున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఎవరి ప్రియురాలితో వారు రొమాన్స్ చేయడంతో తప్పేముంది చెప్పండి.. కాకపోతే నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఆ బాగోతాన్ని నలుగురిలో పెడుతున్నారు చూడు అది ముమ్మాటికి తప్పు. చుట్టూ ఉన్నవారు ఆ జంటకేసి చూస్తుంటే మరింత రెచ్చిపోతుంటారు. ఈరోజుల్లో ఇలాంటి ఘటనలు ఎన్ని జరగట్లేవ్ చెప్పండి.. కాకపోతే అలా రొమాన్స్ చేస్తూ చేస్తూ ఎస్పీ స్థాయి పైఅధికారి కంటపడటం ఈ కథనం కొత్త దనం.
ఛత్తీస్‌గఢ్, జష్‌పూర్‌లోని హైవేపై ఓ యువకుడు.. తన ప్రియురాలిని ఆకట్టుకునేందుకు స్పోర్ట్స్ బైక్‌పై విన్యాసాలు చేశాడు. ఎదురుగా పెట్రోలు ట్యాంక్‌పై అమ్మాయిని కూర్చోబెట్టుకుని ముద్దుల కురిపించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్పీ స్థాయి పోలీసు అధికారి వీరి రొమాన్స్‌ను కనిపెట్టారు. జాష్‌పూర్ ఎస్పీ శశి మోహన్ సింగ్ తన కారులో నుండి వారిని గుర్తించి, ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న జంటను వీడియో తీశారు. చూస్తుండగానే వారి సరసాలు హద్డులు మీరుతుండడంతో.. ఇక లాభం లేదనుకొని వారి బైక్ ఆపారు. ఇంకేముంది, ఇద్దరికి బుద్ధిచెప్పి.. చలాన్ విధించి వదిలేశారు. కాకపోతే వారి రొమాంటిక్ విన్యాసాలు మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
శనివారం (మే 11) మధ్యాహ్నం కుంకూరి నుంచి జాష్‌పూర్ వెళ్తుండగా జాతీయ రహదారి (NH)-43పై జంట విన్యాసాలు చేస్తూ కనిపించినట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. బైకర్‌ను వినయ్‌గా, అమ్మాయిని సుహానిగా గుర్తించామని తెలిపారు. వారిని ఆపి విచారించామని, మాయాలి డ్యామ్‌ను సందర్శించేందుకు వచ్చి ఈ విన్యాసం చేస్తున్నామని చెప్పారని వివరించారు. వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకున్నామన్నాని తెలిపారు.
CG : प्रेमिका को बाइक की टंकी पर बिठाकर फिल्मी अंदाज में रोमांस और स्टंट कर रहा था युवक-युवती, एसपी जशपुर शशिमोहन सिंह ने पकड़ा !!
— MANOJ SHARMA LUCKNOW UP?????? (@ManojSh28986262) May 11, 2024
देखिए VIDEO
कटनी-गुमला नेशनल हाईवे पर एक प्रेमी जोड़े का बाइक पर स्टंट करते हुए वीडियो सामने आया है !!
इस वीडियो को कुनकुरी पुलिस ने पुलिस अधीक्षक… pic.twitter.com/nqzmPlzCHu