జార్ఖండ్ లోని దుమ్కాలో ఉద్రిక్తత..144 సెక్షన్

జార్ఖండ్ లోని దుమ్కాలో ఉద్రిక్తత..144 సెక్షన్

జార్ఖండ్ లోని దుమ్కాలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఈ నెల 23న యువతి అంకితపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు షారుఖ్ అనే యువకుడు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు రిమ్స్  హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. అంకితను షారుక్  హుసేన్  అనే యువకుడు ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. అందుకు అంకిత అంగీకరించకపోవడంతో ఈనెల 23న ఉదయాన్నే ఆమె నిద్రిస్తున్న టైంలో పెట్రోల్ పోసి నిప్పంచించాడు.

ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నగరంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా దుమ్కా సబ్ డివిజన్ లో 144వ సెక్షన్  విధించారు. నిందితుడు షారుఖ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.