పెద్ద నగరాల్లో రెండో ఎయిర్ పోర్టు ?

పెద్ద నగరాల్లో రెండో ఎయిర్ పోర్టు ?

సియోల్ : పెరుగుతున్న రద్దీ తట్టుకునేందుకు ప్రధాన నగరాలలో రెండో ఎయిర్పోర్టు కట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద నగరాలలో ఎయిర్పోర్టు, ఏరోడ్రోమ్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇవ్వాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్ గురుప్రసాద్ మొహాపాత్ర చెప్పారు. దేశంలో 125 ఎయిర్పోర్టులు, 11 ఇంటర్నేషనల్ ఏరోడ్రోమ్లను ఏఏఐ నిర్వహిస్తోంది. ఇండియాలో ఇప్పుడు స్థల సేకరణ పెద్ద అవరోధంగా మారిందని మొహాపాత్ర తెలిపారు. ఎయిర్పోర్టు కట్టాలంటే కనీసం 2 వేల ఎకరాలు అవసరమని అన్నారు. నగరానికి సమీపంలో స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు తమతోపాటు, సివిలియేషన్ మంత్రిత్వ శాఖ కూడా లెటర్స్ రాసినట్లు చెప్పారు. తమకు ఇచ్చే స్థలానికి చుట్టుపక్కల భూమి వినియోగంపై పరిమితులు పెట్టాలని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.

ముంబై, ఢిల్లీ నగరాలలో రెండో ఎయిర్పోర్టులు ఇప్పటికే వస్తుండగా, విశాఖపట్నంలో కూడా మరో ఏరోడ్రోమ్ రానుందని అన్నారు. కోల్కతా, చెన్నై, పుణెలతోపాటు, మరికొన్ని నగరాలలో రెండో ఎయిర్పోర్టును ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. దేశీయ విమానయానం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ మనదేనని చెప్పారు. ఫుల్ సర్వీస్ కారియర్ జెట్ ఎయిర్వేస్ కుప్పకూలడంతో ఈ ఏడాది ఏప్రిల్లో దేశీయ విమానయాన రంగం ప్రతికూల వృద్ధి నమోదు చేసిందని అన్నారు.

ఏప్రిల్ నెలలో ఇండియాలోని అన్ని ఎయిర్పోర్టులు కలిపి 2.67 కోట్ల పాసింజర్లను, 2,75,150 టన్నుల సరుకు రవాణాను హ్యాండిల్ చేసినట్లు ఐఏటీఏ డేటా చెబుతోంది. జెట్ ఎయిర్వేస్ నుంచి తమకు రావల్సిన డబ్బును వసూలు చేసుకున్నట్లు మొహాపాత్ర వెల్లడించారు. ఎయిర్లైన్స్ సంస్థల నుంచి రావల్సిన బకాయిలను సీరియస్గా పరిగణిస్తామని అన్నారు. జెట్ ఎయిర్వేస్ మూతపడటంతో ఎయిర్పోర్టులలో 700 స్లాట్స్ ఖాళీగా ఉంటున్నాయని తెలిపారు. వీటిని టెంపొరరీగా ఇతర ఎయిర్లైన్స్కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.