గెలిచినా ఓడినా ప్రజా సేవ చేయడమే తెలుసు : జీవన్ రెడ్డి

గెలిచినా ఓడినా ప్రజా సేవ చేయడమే తెలుసు : జీవన్ రెడ్డి

గెలిచినా ఓడినా ప్రజా సేవ చేయడమే తనకు తెలుసని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. తనను కరీంనగర్ నుంచి పోటీ చేయమని పార్టీ నేతలు చెప్పినా.. తనకు జన్మనిచ్చిన గడ్డకు సేవ చేయాలనే నిజామాబాద్ నుంచి పోటి చేస్తున్నాని తెలిపారు. ఐదేళ్లుగా ఎంపీగా ఉండి అరవింద్ ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. పసుపు బోర్డు గురించి అడిగితే మరోసారి గెలిపించమంటున్నాడని విమర్శించారు.

 ఆనాడు కవితకు అవకాశం ఇస్తే చెరుకు ఫ్యాక్టరీ మూసేయించిందని నీకు అవకాశం ఇస్తే విలాసాలతో ప్రజలకు అన్యాయం చేసావని ఫైర్ అయ్యారు. మామిడి మార్కెట్, జేఎన్టీయూ, శాతవాహన యూనివర్శిటీ, రాజీవ్ రహదారి వంటివన్నీ తానే తెచ్చానని తెలిపారు. చెరుకు ఫ్యాక్టరీ వచ్చే ఏడాదిలోగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, మామిడి పరిశోధన కేంద్రం, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు తేవాల్సి ఉందని త్వరలో వస్తాయని తెలిపారు. 

మామాడి ఎగుమతి కోసం రైల్వే మార్గం తెస్తామని ప్రకటించారు. 2004 నుంచి 20-09 కాలంలో ఆనాటి వై.ఎస్.నియోజకవర్గమైన పులివెందులకు ధీటుగా జగిత్యాలను అభివృద్ధి చేసాననని చెప్పారు. గల్ఫ్ సంక్షేమ బోర్డుకు సీఎం అంగీకరించారని తెలిపారు. బీడీ కార్మికులకు అండగా ఉంటామని 2014 కటాఫ్ తేదీతో నష్టపోయిన బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తామని వెల్లడించారు జీవన్ రెడ్డి