మణికొండ పంచవటి కాలనీలో భారీ అగ్నిప్రమాదం

మణికొండ పంచవటి కాలనీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పంచవటి కాలనీలోని రోడ్ నెంబర్ 16లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుకు పక్కనే ఉన్న గుడిసె, ఫుట్ పాత్ పై ఉన్న పాన్ షాప్ లకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన స్థానికులు.. భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

విషయం తెలుసుకున్న ఫిలింనగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో గుడిసె, పాన్ షాపు పూర్తిగా దగ్దమయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.