Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...

Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...

స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు.. పిల్లలు ఎక్కడికైనా టూర్​ వెళ్దామని మారాం చేస్తుంటారు. . అయితే ఉద్యోగం... పని ఒత్తిడి.. వలన టూర్​ వెళ్లడం కుదరదు.. అందులోనూ ఎండలు మండుతున్నాయి.  అయినా సరే ఫ్యామిలీ ట్రిప్​నకు ప్లాన్​ చేస్తుంటారు.. అలా వెళ్లాలంటే మూడు, నాలుగు రోజులు ప్లాన్​ వేసుకోవాలి.. బడ్జెట్​ చూసుకోవాలి.. పిల్ల.. జల్లతో అన్ని రోజులు టూర్​ అంటే ఆషా మాషీకాదు.   సమ్మర్​ లో వన్డేలో ఫ్యామిలీతో ఎంజాయి చేద్దామనుకుంటున్నారా..  హైదరాబాద్​కు దగ్గరలో నే ఓ చక్కటి ప్రాంతం ఉంది.  కేవలం ఒక్కరోజులోనే వెళ్లి రావచ్చు.. ఇంతకూ ఆ ప్రాంతం ఏది.. అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం...

హైదరాబాద్ చుట్టుపక్కల పచ్చదనం నిండిన ప్రాంతాల కోసం వెతుకుతున్నారా? అయితే ఓసారి గొట్టం గుట్టకు వెళ్ళండి. ఉదయం వెళితే సాయంత్రానికి ఇంటికి వచ్చేయొచ్చు. రోజంతా కుటుంబంతో అక్కడ హాయిగా గడపవచ్చు. దీన్ని చూస్తే ఊటీ గుర్తుకొస్తుంది. గొట్టం గుట్టను తెలంగాణ ఊటీ అని కూడా అంటారు. ఈ చల్లని ప్రదేశంలో నిండుగా చెట్లు, పారే జలపాతం కంటికి ఇంపుగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి  రెండు గంటల్లో అక్కడికి చేరుకుంటారు. ఈ గొట్టం గుట్ట చాలా అందంగా ఉంటుంది. 

హైదరాబాద్ నుంచి  జహీరాబాద్ కు చేరుకోవాలి. జహీరాబాద్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గొట్టం గుట్ట. రెండు మూడు రోజులు ఈ గొట్టం గుట్టలో విహరించాలనుకుంటే జహీరాబాద్ లోని హోటల్ లో వసతి బుక్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి ఈ గొట్టం గుట్ట ప్రాంతానికి వెళ్లి ఒక్కరోజులో వచ్చేయవచ్చు. ఉదయం వెళ్లి సాయంత్రానికి రావాలని అనుకుంటే  ప్రైవేట్​ వెహికల్​పై వెళ్లాలి. 

గొట్టం గుట్టలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వెళితే  ప్రకృతి ఒడిలో నిదురుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా పచ్చని అందాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. అడవి మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరు. ఈ ప్రాంతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధికంగా వస్తూ ఉంటారు. తెలంగాణకు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉన్న గ్రామం గొట్టం గుట్ట.

ఈ ప్రాంతంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు  ఉన్నాయి. అలాగే చించోలి అభయారణ్యం ఉంది. శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవానీ మాత ఆలయం పర్యటకులను ఆకట్టుకుంటాయి. శ్రీ గురు గంగాధర భక్త ప్రభూ దేవస్థానం ఇక్కడ ఉంది. ఎంతోమంది ఈ అడవిలో ఉన్న దేవాలయాలకు వెళతారు. దీన్ని రెండో శ్రీశైలం గా పిలుచుకుంటారు.

గొట్టం గుట్ట నుంచి పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మల్కాపూర్ జలపాతం వస్తుంది. ఈ జలపాతాన్ని ఎంత చూసినా తనివి తీరదు. లోతైన లోయలు పర్యాటకలను ఆకర్షిస్తాయి. చుట్టూ ఎత్తైన కొండలు మరొక ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడికి దగ్గరలోనే చంద్రగిరి అని పిలిచే డ్యాం కూడా ఉంది. గొట్టం గుట్టకు వెళ్లేవారు చంద్రగిరి డ్యామ్ ను తప్పక సందర్శిస్తారు. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీతో ఒక్కరోజులో హైదరాబాదు నుంచి ఏదైనా అందమైన ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఒకసారి ఈ గొట్టం గుట్ట ప్రాంతానికి వెళ్లి చూడండి. మీకు ఎన్నో మధురాను బదులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి..