
ప్రపంచంలో రెండో అతిపెద్ద డైమండ్‌ను లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే ఫ్రెంచ్ కంపెనీ లూయూ విట్టన్ కొనుగోలు చేసింది. త్వరలో డైమండ్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్న ఈ కంపెనీ.. తన బ్రాండ్‌ను వస్తువుల నుంచి వజ్రాలకూ విస్తరించడానికి, డైమండ్ వ్యాపారాన్నిజనంలోకి తీసుకెళ్లడానికి ఈ భారీ వజ్రాన్ని కొన్నది. చిన్న ముక్కలుగా కోయించేందుకు బెల్జియంలోని అంట్వార్ప్‌కు చెందిన హెచ్‌బీ అనే కంపెనీతో ఒప్పం దం కుదుర్చుకుంది. మన చేయి సైజుండే 1,758 క్యారెట్ల ఈ డైమండ్‌ను గత ఏప్రిల్‌లో బోట్స్‌వానాలో లుకారా డైమండ్ కార్పొరేషన్ కనుగొంది. దానికి సెవెలో (రేర్ ఫైండ్)అని పేరు పెట్టింది. ఈ డైమండ్ కు లూయీ విట్టన్ ఎంత ముట్టజెప్పిందో మాత్రం తెలియలేదు. ఇప్పటివరకు కనుగొన్న డైమండ్లలో అతి పెద్దది కల్లినన్ డైమండ్. సౌతాఫ్రికాలో 1905లో బయటపడ్డ ఈ డైమండ్ 3,106 క్యా రెట్లది. 9 భాగాలుగా కోశారు. వాటిల్లో పెద్దవైన రెండు డైమండ్లు (గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా, లెస్సర్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా) లను బ్రిటన్ క్రౌన్ నగల్లో అమర్చారు.
see more news 5.6 కిలోమీటర్ల పొడవు… వరల్డ్ రికార్డ్ కేక్