సెస్ ఫలితాల్లో గందరగోళం..పోలీసుల లాఠీచార్జ్

సెస్ ఫలితాల్లో గందరగోళం..పోలీసుల లాఠీచార్జ్

సెస్ ఫలితాల్లో గందరగోళం కొనసాగుతోంది. వేములవాడ రూరల్ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు మొదట ప్రకటించారు. అయితే మెజార్టీ 5 ఓట్లు మాత్రమే ఉండటంతో.. మళ్లీ రీ కౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇదే టైంలో బీజేపీ నేతలు కూడా ఆందోళన చేశారు. అధికారులు, పోలీసులు బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు కౌంటింగ్ కేంద్రం ముందు బైఠాయించారు. ఇదే టైంలో రెండు పార్టీల నేతలు గొడవకు దిగడంతో పోలీసులు స్వల్ప లాఠిచార్జి చేశారు. దీంతో అధికారులు దిగివచ్చి బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు.

గందరగోళం మధ్యే వేములవాడ రూరల్ అభ్యర్ధిని ప్రకటించారు ఎన్నికల అధికారులు. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుపతి గెలుపుతో బీజేపీ కార్యకర్తల సంబురాలు చేసుకుంటున్నారు. అయితే అంతకు ముందు కౌంటింగ్ కేంద్రం ముందు కేంద్రం దగ్గర బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల గొడవకు దిగారు. దీంతో స్వల్ప లాఠిచార్జితో పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ ఆందోళనతో ఎన్నికల అధికారులు దిగివచ్చారు.