కుదురుకుంటే రోహిత్ ను అపడం ఎవరి తరం కాదు

కుదురుకుంటే రోహిత్ ను అపడం ఎవరి తరం కాదు

నా అదృష్టంన్యూఢిల్లీ: టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​ అంటేనే ఉల్లాసం, ఉత్సాహానికి మారుపేరు. వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చినా.. ప్రతి ఒక్కరూ చాలా కలివిడిగా ఉంటారు. అందుకే ఇండియా టీమ్​లో ప్రతి వ్యక్తి చాలా భిన్నంగా ఉంటారని ఓపెనర్​ శిఖర్​ ధవన్​ అన్నాడు. ప్రతి ఒక్కరు టీమ్​ కోసం చాలా కష్టపడతారని, వారిలో ఉండే ఎనర్జీనే అత్యుత్తమ కాంబినేషన్స్​కు కారణమని చెప్పాడు. అందుకే విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మలాంటి కరెంట్ ​జనరేషన్​ ప్లేయర్లతో కలిసి ఆడటం తన అదృష్టమని చెప్పాడు. ‘టీమ్​లో ప్రతి ఒక్కరు ఓ స్పెషల్​. వీళ్లంతా కలిసి టీమ్​గా రూపొందడం మరో అద్భుతం. ప్రతి ప్లేయర్​ చాలా డిఫరెంట్​గా ఉంటాడు. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది టీమ్​కు చాలా ఉపయోగపడుతున్నది. ప్రతి ఒక్కరు తమ స్పిరిట్​ను చూపెడుతున్నారు’ అని ధవన్​ పేర్కొన్నాడు.

విరాట్, రోహిత్​ అమేజింగ్​..

తన సహచరులు విరాట్​, రోహిత్​లను గబ్బర్​ ఆకాశానికెత్తేశాడు. ఆరంభంలో కుదురుకోవడానికి రోహిత్​ కాస్త టైమ్​ తీసుకున్నా.. ఆ తర్వాత అతన్ని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ‘ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే రోహిత్​ విధ్వంసం సృష్టిస్తాడు. ఏ బౌలర్​, ఏ ఫీల్డర్​, ఏ కెప్టెన్​ కూడా అతన్ని ఆపలేరు. తనంతట తానుగా అతను ఔట్​ కావాలి. లేదంటే ఆరంభంలోనే వికెట్​ తీయాలి. ఈ రెండు జరగలేదంటే ఆ రోజు బౌలర్లకు చుక్కలే. ఇక విరాట్​ ఆట అద్భుతం. పరిస్థితులు ఎలా ఉన్నా.. నిలకడగా రన్స్​ సాధిస్తాడు. అమేజింగ్​ ఫుట్​వర్క్​, క్లాసిక్​ ఆటతీరుతో బౌలర్లకు సింహ స్వప్నంగా నిలుస్తాడు. అందుకే ఈ ఎరాలో వీళ్లతో కలిసి ఆడుతున్నందుకు నా అంతఅదృష్టవంతుడు మరొకరు ఉండరు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా నాలో ఉన్న అంతర్గత మనశ్శాంతిని మాత్రం ఏమీ చేయలేవు’ అని ఈ ఢిల్లీ బ్యాట్స్​మన్​ వ్యాఖ్యానించాడు.

ఒకరితో పోల్చుకోను..

తోటి క్రికెటర్లతో పోల్చుకుంటే నెగెటివ్​ ఆలోచనలు ఎక్కువగా వస్తాయని ధవన్​ వెల్లడించాడు. ‘ఇతర ఓపెనర్లు, టీమ్​మేట్స్​తో పోటీపడటానికి ఇష్టపడతాను. కానీ వాళ్లతో పోల్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. వాళ్లతో కంపేర్ ​ చేసుకోవడం వల్ల జెలసీ వస్తుంది. నేను బాగా ఆడినా.. వాళ్లకంటే బాగా ఆడలేదనే నెగెటివ్​ ఫీలింగ్​లో ఉండిపోతా. అల్టిమేట్​గా నా ఆట దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో నేనే ఓ అడుగు వెనక్కి వేసి నా కలలను నెరవేర్చుకున్నా కదా ఇంకెందుకు ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటా. లేదంటే లైఫ్​లో రియల్​ హ్యాపీనెస్​ను కోల్పోతా. దీనివల్ల ఇంకేదో సాధించాలన్న కసి పెరుగుతుంది. అందుకే నేనెవరితోనూ పోల్చుకోను. రెండు రోజులు ఆడినా.. రెండేళ్లు ఆడినా నా దృక్పధం ఇదే’ అని శిఖర్​ చెప్పాడు. స్కిల్స్​కు ఎలాగైతే మెరుగులు దిద్దుకుంటామో.. మైండ్​సెట్​ను కూడా అలాగే కాపాడుకోవాలన్నాడు. ‘నాలో ఈ ఎనర్జీ ఉంది కాబట్టే నేనింకా క్రికెట్​ ఆడుతున్నా. ఒకవేళ నేను జీరోకే ఔటైనా పాజిటివ్​గానే తీసుకుంటా. అంటే అలా ఎందుకు ఔటయ్యానని విశ్లేషణ చేసుకోలేనని కాదు. నేను చేసిన తప్పును అర్థం చేసుకుంటా. దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తా. ఈ ఎనర్జీ అంతా నాకు యోగా నుంచి వచ్చింది. ఫిజికల్​గా, మెంటల్​గా స్ట్రాంగ్​గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతున్నది’ అని ధవన్​ చెప్పుకొచ్చాడు.

ఖేల్ రత్నకు కిడాంబి శ్రీకాంత్