V6 News

హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం.. స్కూటీ కొట్టేసి ఇదేంటని అడిగితే కొట్టారు..!

హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం.. స్కూటీ కొట్టేసి ఇదేంటని అడిగితే కొట్టారు..!

హైదరాబాద్: మద్యం మత్తులో ‘‘నేనేరా హెడ్ కానిస్టేబుల్’’ అంటూ యువకులపై ఒక కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. ఓ జిమ్లో ఇద్దరు అన్నదమ్ములు కోచింగ్ తీసుకుంటున్నారు. అదే జిమ్ పార్కింగ్లో యాక్టివా రెడ్ కలర్ వెహికల్ పార్క్ చేసి జిమ్ కోచింగ్కి వెళ్లారు. 

యాక్టివా లాక్ చేసి లేకపోవడంతో ఓ కానిస్టేబుల్ పార్కింగ్ నుంచి యాక్టివా వాహనం తీసుకెళ్లి దగ్గరలోని టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నాడు. ఇంటికి వెళ్లేందుకు జిమ్ నుంచి బయటకు వచ్చిన అన్నదమ్ములకు యాక్టివా స్కూటీ కనిపించలేదు. ఆ చుట్టుపక్కల వెతకగా.. దగ్గరలోని టీ స్టాల్ దగ్గర వెహికల్ చూసి ‘‘ఈ స్కూటీ నాది అన్న’’ అని సదరు కానిస్టేబుల్తో అన్నదమ్ముల్లో ఒకరు మాట్లాడుతున్నారు.

అయితే.. ఒక పక్క మాట్లాడుతుండగానే.. కానిస్టేబుల్, అతని స్నేహితులు కలిసి అన్నదమ్ములు ఇద్దరినీ చితకబాదారు. కానిస్టేబుల్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. ‘‘నేనే రా పోలీసు.. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నేను.. నేను ఏది చేసినా నడుస్తుంది.. రాజ్యాంగం చదివిన కానిస్టేబుల్ని నేను.. ఏం పీకుతావ్ నన్ను నువ్వు’’ అని నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ.. అన్నదమ్ములపై కానిస్టేబుల్, అతని స్నేహితులు కలిసి దాడి చేశారు. ఈ ఘటనపై.. గొడవకు కారణమైన కానిస్టేబుల్పై బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఈ కానిస్టేబుల్ ఎవరా అని గచ్చిబౌలి పోలీసులు ఆరా తీస్తున్నారు.