అయ్యర్‌‌కు సర్జరీ... 4  నెలలు ఆటకు దూరం

అయ్యర్‌‌కు సర్జరీ... 4  నెలలు ఆటకు దూరం

పుణె:  ఇంగ్లండ్‌‌తో ఫస్ట్‌‌ వన్డేలో గాయపడ్డ టీమిండియా బ్యాట్స్‌‌మన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఈ సిరీస్‌‌లో మిగిలిన రెండు మ్యాచ్‌‌లుకూ దూరం అయ్యాడు. ఇంజ్యురీకి సర్జరీ అవసరం కావడంతో  ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌లో కూడా అతను బరిలోకి దిగే చాన్స్‌‌ కనిపించడం లేదు.   ‘అయ్యర్‌‌ షోల్డర్​ ఇంజ్యురీకి సర్జరీ చేయాల్సిందే. కోలుకొని తిరిగి బ్యాట్‌‌ పట్టాలంటే కనీసం నాలుగు నెలల టైమ్​ పడుతుంది.  కాబట్టి ఐపీఎల్‌‌ ఫస్ట్‌‌ ఫార్ట్‌‌కే కాదు మొత్తం లీగ్‌‌లోనే ఆడే అవకాశం లేదు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయ్యర్‌‌ ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు కెప్టెన్‌‌గా ఉన్నాడు. అతను దూరమైతే  పంత్‌‌, స్మిత్‌‌, అశ్విన్‌‌లో ఒకరు ఢిల్లీ టీమ్‌‌ను నడిపించే చాన్స్‌‌ ఉంది. అయితే, అయ్యర్‌‌ గాయం, సర్జరీ గురించి బీసీసీఐ అఫీషియల్‌‌గా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు, ఫస్ట్‌‌ వన్డేలో గాయపడ్డ ఇంగ్లండ్‌‌ కెప్టెన్‌‌ ఇయాన్‌‌ మోర్గాన్‌‌, సామ్‌‌ బిల్లింగ్స్‌‌ సెకండ్‌‌ మ్యాచ్‌‌లో ఆడడంపై సందిగ్ధత నెలకొంది.