సంక్రాంతికి 4,940 స్పెషల్ బస్సులు

సంక్రాంతికి 4,940 స్పెషల్ బస్సులు

రాష్ట్రంలో 3,414, ఏపీకి 1,526 స్పెషల్ సర్వీసులు

జనవరి 10 నుంచి 13 వరకు నడుపనున్న ఆర్టీసీ

200 కి.మీ.లోపు ఎక్స్‌‌‌‌ట్రా చార్జీలుండవ్ 

అడ్వాన్స్ రిజర్వేషన్లకు అవకాశం 

ఈసారి సంక్రాంతి ఆదాయం రూ.6 కోట్లొచ్చే చాన్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్యాసింజర్లకు ఇబ్బందులు రాకుండా స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ మేనేజ్ మెంట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా3,414, ఏపీకి 1,526 స్పెషల్ బస్సులు జనవరి10 నుంచి13 వరకూ నడుస్తాయని అధికారులు తెలిపారు. రెగ్యులర్ బస్సులకు అదనంగా10న 965, 11న 1,463, 12న 1,181, 13న 1,152, బస్సులను నడుపుతామని చెప్పారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆయా రూట్లలో ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా నిత్యం ఆయా డిపోల అధికారుల పర్యవేక్షణలో మానిటరింగ్ కూడా జరుగుతుందన్నారు.

200 కి.మీ.లోపు ఎక్స్‌‌‌‌ట్రా చార్జీల్లేవ్..

సంక్రాతి సందర్భంగా రెగ్యులర్ బస్సులతో పాటు200 కి.మీ లోపు ఉండే ప్రాంతాలకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణానికి కూడా రద్దీని బట్టి17వ తేదీ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతామని వెల్లడించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ల కోసం ఆర్టీసీ వెబ్ సైట్( https://www.tsrtconline.in/ )లోకి లాగిన్ కావాలని సూచించారు.  పోయినేడు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసికి రూ. 5 కోట్లు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 6 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సిటీ నుంచి బస్సులు

ఎంజీబీఎస్, సీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్ సుఖ్ నగర్, లింగంపల్లి, చందానగర్,  కేపీహెచ్ బీ, ఎస్.ఆర్.నగర్, అమీర్​పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ తో పాటు జంటనగరాల్లో వివిధ శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు. ఏపీలో విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం కర్నూల్, అనంతపురం, కడప, చిత్తురు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

బస్సుల స్టార్టింగ్ పాయింట్లు ఇవే..

జూబ్లీ బస్ స్టేషన్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే బస్సులు.

ఉప్పల్ క్రాస్ రోడ్: యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట్, మహబూబాబాద్, తొర్రూర్, వరంగల్ వైపు వెళ్లే బస్సులు.

దిల్ సుఖ్ నగర్: మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు.

సీబీఎస్: కర్నూలు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లి వైపు వెళ్లే బస్సులు.

లింగంపల్లి టు కాకినాడ స్పెషల్ ట్రైన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌‌‌‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం తెలిపింది. జనవరి 2,4,7,9,11,14,16,18,21,23,25,28,30 తేదీల్లో లింగంపల్లిలో రాత్రి 7:55గంటలకు సూపర్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ ఏసీ స్పెషల్‌‌‌‌ ట్రైన్‌‌‌‌ బయలుదేరుతుందని పేర్కొంది. ఇదే రైలు1,3,6,8,10,13,15,17,20,22,24,27,29,31 తేదీల్లో రాత్రి 8:10గంటలకు కాకినాడ టౌన్​నుంచి వస్తుందని చెప్పింది. ఈ రైలు వరంగల్‌‌‌‌, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ తదితర స్టేషన్లలో ఆగుతుందని వివరించింది.

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి