ఓఆర్ఆర్ లీజు వివాదం.. కెమెరాలకు అనుమతి లేకుండా అర్వింద్ కుమార్ వివరణ

 ఓఆర్ఆర్ లీజు వివాదం.. కెమెరాలకు అనుమతి లేకుండా అర్వింద్ కుమార్ వివరణ

హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజు వివాదంపై స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. కెమెరాలకు అనుమతి లేకుండా అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ప్రధానంగా ఓఆర్ఆర్ టెండర్ల ఆరోపణలపై మాట్లాడలేదు. రూల్స్ ప్రకారమే బేస్ ప్రైస్ బయటపెట్టలేదన్నారు. ఒకేసారి డబ్బు చెల్లించడాన్నే చూడాలని చెప్పారు. 2022- 23 లో టోల్ ఆదాయం రూ.542 కోట్లు అని తెలిపారు. 30 ఏళ్లలో 15 వేల కోట్ల ఆదాయం లెక్క కరెక్టు కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. టెండర్ సంస్థపై వచ్చిన ఆరోపణలపై మున్సిపల్ శాఖ సైలెంట్ గా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.