ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. జాతర నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేయాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌, శానిటేషన్‌‌‌‌‌‌‌‌ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గుట్టపైన, ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపాలని, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నియంత్రణ కోసం రూట్‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌ రెడీ చేయాలన్నారు. మహిళా భక్తులు ఇబ్బందులు పడకుండా స్నానాల గదులు, నీటి కుళాయిలు ఏర్పాటు చేసి నిరంతరం నీటి వసతి కల్పించాలని సూచించారు. చెరువు కట్టపై బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం జాతర పనులను పరిశీలిచారు. కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోడి సైదులు యాదవ్, జడ్పీ సీఈవో సురేశ్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రకుమార్, ఈవో కుషలయ్య, పీఆర్‌‌‌‌‌‌‌‌ ఈఈ వెంకటేశ్వర్లు, మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ ఈఈ వెంకటేశ్వర్లు, డీపీవో యాదయ్య పాల్గొన్నారు.

‘మన ఊరు మన బడి’ పనులు పూర్తి చేయాలి 

మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను జనవరి 8 వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహించొద్దని, ఈజీఎస్‌‌‌‌‌‌‌‌ కింద చేపట్టిన ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మోడల్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ వారీగా పనులు పూర్తి చేసి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలని చెప్పారు. 

రూ. 2 వేల కోట్లు దాటిన డీసీసీబీ టర్నోవర్‌‌‌‌‌‌‌‌

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మూడేళ్ల కింద రూ.900 కోట్లు ఉన్న డీసీసీబీ టర్నోవర్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం రూ.2,030 కోట్లు దాటిందని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. గురువారం నల్గొండలో జరిగిన పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 5వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అనంతరం డైరీ, క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కేవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, మోహన్‌‌‌‌‌‌‌‌రావు, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి  పాల్గొన్నారు.

లైబ్రరీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం

నల్గొండఅర్బన్‌‌‌‌‌‌‌‌/సూర్యాపేట, వెలుగు : లైబ్రరీలకు అధునాతన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌‌‌‌‌‌‌‌ అయాచితం శ్రీధర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. గురువారం నల్గొండ, సూర్యాపేట పట్టణాల్లోని లైబ్రరీలను ఆయన సందర్శించి మాట్లాడారు. పాఠకుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్లుగా లైబ్రరీలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యే వారికి అవసరమైన బుక్స్‌‌‌‌‌‌‌‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. నల్గొండలో రూ. 3 కోట్లతో చేపట్టే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. లైబ్రరీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఖాళీ పోస్టులను కూడా త్వరలోనే నింపే ప్రయత్నం చేస్తామన్నారు. మండలాల్లోని లైబ్రరీలను ఆధునికీకరిస్తామని చెప్పారు. నల్గొండలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రేగట్టె మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీ బాలమ్మ, అసిస్టెంట్ లైబ్రేరియన్‌‌‌‌‌‌‌‌ కట్టా నాగయ్య, సూర్యాపేటలో చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, కార్యదర్శి కేవీ సీతారామశాస్త్రి, డైరెక్టర్ రియాజుద్దీన్ పాల్గొన్నారు.

శిల్పారామం పనులను కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయండి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా రాయగిరి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేస్తున్న శిల్పారామం పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శిల్పారామాన్ని గురువారం ఆమె సందర్శించారు. సందర్శకుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులు, వాటర్‌‌‌‌‌‌‌‌ ఫాల్స్‌‌‌‌‌‌‌‌, చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ ఏరియా, బోటింగ్, వాటర్‌‌‌‌‌‌‌‌ ఫౌంటేయిన్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇక్కడ ఫుడ్‌‌‌‌‌‌‌‌ కోర్ట్స్‌‌‌‌‌‌‌‌, హ్యాండ్‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్టాల్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆర్టిఫీషియల్‌‌‌‌‌‌‌‌ కొలనులోకి దిగేందుకు మెట్లు, ఆర్చి పనులు మాత్రమే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయన్నారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి శిల్పారామాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆమె వెంట వైటీడీఏ అసిస్టెంట్ స్థపతి హేమాద్రి ఉన్నారు.

రూ. 400 కోట్లతో మునుగోడు అభివృద్ధి

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రూ. 400 కోట్లతో మునుగోడును నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో నిర్మించిన కమర్షియల్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం కవర్‌‌‌‌‌‌‌‌ షెడ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్లలో ధాన్యం తడవకుండా కవర్‌‌‌‌‌‌‌‌షెడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో డయాలిసిస్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ను జనవరి 3న మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వెన్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజు, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బొడ్డు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సింగిల్‌‌‌‌‌‌‌‌ విండో చైర్మన్‌‌‌‌‌‌‌‌ చింతల దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో స్పీడ్‌‌‌‌‌‌‌‌ పెంచండి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులపై గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌, హైవే, విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, ఏజెన్సీలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులను ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. జనవరి 3, 4 తేదీల్లో పనులను పరిశీలించనున్నట్లు చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక, వర్షాల వల్ల వెనుకబడిన పనులను వేగంగా చేయాలన్నారు. జనవరి 20 లోగా రహదారి విస్తరణ, ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం, ఇంటర్‌‌‌‌‌‌‌‌ లాకింగ్‌‌‌‌‌‌‌‌ టైల్స్‌‌‌‌‌‌‌‌, అప్రోచ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా జంక్షన్ల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. వల్లభరావు చెరువు డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పనుల్లో స్పీడ్‌‌‌‌‌‌‌‌ పెంచాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కేవీ.రమణాచారి, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఈఈ నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.