యంగ్ హీరోలకు జోడీగా నటిస్తోన్న శ్రీలీల

యంగ్ హీరోలకు జోడీగా నటిస్తోన్న శ్రీలీల

రాఘవేంద్రరావు సూపర్ విజన్‌‌లో తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ దక్కించుకుని టాలీవుడ్‌‌లో బిజీ హీరోయిన్‌‌గా మారింది. రీసెంట్‌‌గా ‘ధమాకా’తో సూపర్ హిట్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. అలాగే రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ లాంటి యంగ్ హీరోలకు జోడీగా నటిస్తోంది. రామ్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రంలో గురువారం నుంచి శ్రీలీల జాయిన్ అయ్యింది.

హైదరాబాద్‌‌లో జరుగుతున్న షూటింగ్‌‌లో రామ్, శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. ఇందులో రామ్‌‌ని కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌‌‌‌లో చూపించబోతున్నాడట బోయపాటి. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నారు.