V6 News

ఆర్టీసీపై రాష్ట్ర బీజేపీ చొరవ తీసుకోవాలి : పొన్నం

ఆర్టీసీపై రాష్ట్ర బీజేపీ చొరవ తీసుకోవాలి : పొన్నం

ఆర్టీసీ సమ్మె పరిష్కరం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చొరవ తీసుకోవాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. వట్టి ఓదార్పు వ్యాఖ్యలతో సరిపుచ్చి మీ ఉద్యమానికి మా మద్దతు అంటే సరిపోదన్నారు. సమ్మె 21 రోజుల నుండి జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది.. అడపా దడపా ప్రకటనలు తప్ప కార్యచరణ ఏదని ప్రశ్నించారు పొన్నం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్ర బీజేపీ సమ్మె పరిష్కరం చేయాలని ఎందుకు కోరడం లేదన్నారు. ఆర్టీసీ సమ్మెపై లక్ష్మణ్ ఓదార్పు వ్యాఖ్యలు చేయడం కాదని.. ఇరవైఒక్క రోజులుగా సమ్మె జరుగుతుంటే ప్రజాజీవనం స్తంభించిపోవడం కనబడడం లేదా అన్నారు.

కార్మికులు జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే.. బీజేపీ ప్రేక్షకపాత్ర వహిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కేంద్రం పక్షాన ఏం చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర బీజేపీ తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ నివేదిక అంధచేసి చాలా రోజులైందని.. కానీ ఇంతవరకు సమస్య పరిష్కరం కోసం కేంద్రం నుండి ఎలాంటి చర్యలు లేవన్నారు. సీఎం తీవ్రమైన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ సీరియస్ గా పరగణించాలన్నారు. సమ్మెపై కేంద్ర ప్రభుత్వం జ్యోక్యం చేసుకునేలా రాష్ర్టా బీజేపీ కృషి చేయాలన్నారు.

ప్రజా జీవితం ప్రజా రవాణా సమ్మె ద్వారా ఇబ్బంది పడకుండా ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరించాలని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వనికి ఆదేశాలు జారీ చేసి, ఆర్టీసీ కార్మిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. దీనికి సంబంధించి మాటలో కాకుండా చేతలో రాష్ట్ర బీజేపీ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. లేకపోతే బీజేపీ,టిఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలేనని ప్రజల్లో భావన కలుగుతుందన్నారు పొన్నం.