V6 News

హైదరాబాద్ రిచ్ కిడ్స్ టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్ లో మైనర్లకు వల.. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల దోపిడీ!

హైదరాబాద్  రిచ్ కిడ్స్ టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్ లో మైనర్లకు వల.. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల దోపిడీ!

హైదరాబాద్‌లోని సంపన్న వర్గాలే టార్గెట్ గా సాగుతున్న భారీ మోసాన్ని  షీ టీమ్స్ పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ కేంద్రంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఒక కిరాతక ముఠాను పట్టుకున్నారు. 

ముఖ్యంగా తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి  ఇక్కడ ప్రముఖ స్కూల్స్‌లో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిలే వీరి ప్రధాన టార్గెట్. సోషల్ మీడియాలో తాము నిత్యం పబ్బులు, పార్టీల్లో తిరుగుతున్నట్లు ఒక హై-ఫై లైఫ్ స్టైల్‌ను చూపిస్తూ.. ఫేక్ ఇమేజ్‌తో అమాయకపు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటారు. ముందుగా స్నేహం నటించి, ఆపై మైనర్ అమ్మాయిల నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరిస్తారు. ఆ తర్వాత అసలు స్వరూపం బయటపెడతారు. సేకరించిన వీడియోలను అడ్డం పెట్టుకుని, బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేయడం ఈ గ్యాంగ్ పని.

►ALSO READ | హైదరాబాద్ పోలీసుల మెగా ఆపరేషన్..850 కేసులు, 150 కోట్ల దోపిడీ.. ప్రముఖ బ్యాంకుల మేనేజర్లు అరెస్ట్

ఈ మోసంలో మరో విస్తుపోయే నిజం ఏమిటంటే.. బాధితుల కదలికలను తెలుసుకోవడానికి ఈ ముఠా ఏకంగా వారి ఇంట్లోని పని మనుషులను వాడుకుంది. వారి ద్వారా బాధితుల కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని పక్కా ప్లాన్‌తో దాడులు చేస్తారు.

ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతుర్ని టార్గెట్ చేసి భారీగా డబ్బు వసూలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన షీ టీమ్స్, పక్కా ఆధారాలతో గ్యాంగ్ కీలక సభ్యుడు అర్జున్‌ను అదుపులోకి తీసుకుంది. మిగిలిన సభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేసింది.