రెండు రోజులుగా ప్రజలతో పాటు బులియన్ వ్యాపారులు సైతం హడావిడిగా ఉన్నారు. దానికి కారణం అక్షయ తృతీయ కావటమే. ఈ సందర్భంగా గోల్డ్, సిల్వర్ కొంటే మంచిదని, తమకు కలిసి వస్తుందని భారతీయులు నమ్ముతారు. ఈ క్రమంలోనే అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలతో తగ్గిన బంగారం రేట్లు చాలా మందిని షాపింగ్ చేసేలా చేస్తున్నాయి. ప్రధానంగా అక్షయ తృతీయ తర్వాత రేట్లు తగ్గితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు ప్రజలు తమ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను గమనించండి.
ఏప్రిల్20న బంగారం రేట్లు తగ్గాయి. ఏప్రిల్ 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.49 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 529గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 235గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్20, 2026న దేశవ్యాప్తంగా రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 80వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.280గా అమ్మకాలు జరుగుతున్నాయి.

