V6 News

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసిన భార్య.. విచారణ వాయిదా!

 విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసిన భార్య.. విచారణ వాయిదా!

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి విమర్శలు, మరోవైపు వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఇప్పుడు దళపతి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ పై చెంగల్పట్టు కోర్టు విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిమాణాలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మరో వైపు ఆయన భార్య సంగీత కూడా రాలేదు. దీంతో ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది.

భారీగా భరణం డిమాండ్?.

అయితే విజయ్ - సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం చైన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చించినట్లు సమాచారం. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అయితే సెటిల్ మెంట్ కింద ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన ఆస్తుల ఆధారంగా , తన ఇద్దరు పిల్లలు భవిష్యత్తు కోసం సుమారు రూ.  250 కోట్లు భరణం సంగీత కోరినట్లు టాక్ వినిపిస్తోంది.  అయితే విజయ్ మాత్రం సంగీతకు రూ. 35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమచారం. కుమారుడు, కుమార్తె బాగోగులు తాను చూసుకుంటానని విజయ్ అన్నట్లు తెలుస్తోంది. అయితే విడాకుల వ్యవహారం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోదని సమాచారం.

పిటిషన్‌లో సంగీత ఆరోపణలు

విజయ్ నుంచి విడాకుల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత పిటిషన్ దాఖలు చేశారు.  అందులో ఆమె పేర్కొన్న అంశాలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.  విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. తనను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారని, కనీస ఆర్థిక స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కదలికలపై ఆంక్షలు విధించారని, మాటలతో తీవ్రంగా కించపరిచారని ఆమె వాపోయారు

ఎన్నికల ముందే ఎందుకు?

తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్‌కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అయితే, సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో ఈ విడాకుల వ్యవహారం తెరపైకి రావడం ఆయనకు ప్రతికూలంగా మారుతుందా అన్న చర్చ సాగుతోంది. మరి ఈ విడాకుల వ్యవహారం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.