V6 News

Dhurandhar 2 Box Office: ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డ్.. ‘పుష్ప2’ని వెనక్కి నెట్టిన ‘ధురంధర్ 2’

Dhurandhar 2 Box Office: ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డ్.. ‘పుష్ప2’ని వెనక్కి నెట్టిన ‘ధురంధర్ 2’

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది . గతంలో ఉన్న రికార్డులను ఒక్కొక్కటి దాటుకుంటూ దూసుకెళ్తోంది. 2026, మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, కేవలం వారం రోజుల్లోనే భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో మూడో ప్లేస్కు చేరుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసి ధురంధర్ 2 సత్తా చాటింది.

పుష్పరాజ్‌ను దాటేసిన ధురంధర్!

ట్రేడ్ విశ్లేషణల ప్రకారం, ‘ధురంధర్2’ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ రికార్డులను ఇది అధిగమించింది. ఇప్పటివరకు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1742 కోట్ల వసూళ్లను సాధించగా, ‘ధురంధర్’ 2 లాంగ్ రన్ (31 రోజుల్లోనే)లో రూ.1749 కోట్లు కలెక్ట్ చేసింది.

►ALSO READ | OTT Thriller: హారర్ డోస్‌తో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్.. కథలో విచిత్ర ఘటనలు, ట్విస్టులు

ఈ సందర్భంగా, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన 3వ అతిపెద్ద మూవీగా అవతరించి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ధురంధర్ జోరు చూస్తుంటే, రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 (రూ.1788 కోట్లు)ని బీట్ చేస్తుందనే టాక్. ఇకపోతే టాప్ 1లో దంగల్ (రూ.2,090 కోట్ల) బెంచ్ మార్క్ సెట్ చేసుకుంది. 

ధురంధర్2 స్ట్రీమింగ్ ఎప్పుడు?

ఐపీఎల్ (IPL 2026) ముగిసిన తర్వాత, అంటే మే 14న లేదా చివరి వారంలో ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో సందడి చేయనుంది. క్రికెట్ మేనియా తగ్గగానే సినీ ప్రియులను అలరించేందుకు ఇదే సరైన సమయమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వెళ్తే మరింతమంది ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం ఉందని మేకర్స్ తో ఓటీటీ సంస్థ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.