V6 News

వచ్చే నెలలో టీడీపీ బస్సుయాత్ర : కాసాని జ్ఞానేశ్వర్

వచ్చే నెలలో  టీడీపీ బస్సుయాత్ర : కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్‌‌, వెలుగు: వచ్చే నెలలో బస్సు యాత్ర చేపట్టాలని రాష్ట్ర టీడీపీ నిర్ణయిం చింది. బుధవారం ఎన్టీఆర్‌‌ ట్రస్ట్‌‌ భవన్‌‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆగస్టు మూడో వారంలో బస్సు యాత్ర చేపట్టాలని, ఇందుకోసం 9 కమిటీ లను ఏర్పాటు చేయాలని మీటింగ్​లో నిర్ణ యించారు. మూడు నెలల కార్యాచరణ రూపొందించాలని, ఇందుకోసం ఈ నెల 28, 29 తేదీల్లో ఎన్టీఆర్ భవన్​లో వర్క్​షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకు న్నారు. 

28న భువనగిరి, చేవెళ్ల, హైదరా బాద్, జహీరాబాద్, మహబూబ్‌‌గర్, మల్కాజ్​గిరి, మెదక్, సికింద్రాబాద్, నల్గొండ.. 29న కరీంనగర్, ఖమ్మం, మహ బూబాబాద్, నాగర్ కర్నూల్, నిజామా బాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ పార్ల మెంట్‌‌ నియోజకవర్గాల నాయకులతో వర్క్​షాప్ నిర్వహించనున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని  బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని కాసాని తెలిపారు.