హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ధర్నా చేశారు. యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ ను బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులకు తోపులాట జరిగింది.
ఈ ఘటనలో పలువురి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 1,57, 000 మంది విద్యార్థులు నుంచి ఒక్కొక్కరి వద్ద 600 రూపాయలు అధికంగా వసులు చేశారని యునివర్సిటీ ముందు నిరసన తెలిపారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
