పిల్లలు కలుగలేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్

పిల్లలు కలుగలేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్

పెళ్లై ఎనిమిది సంవత్సరాలైనా పిల్లలు కలుగలేదని డిప్రెషన్ తో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ లోని నారాయణగూడలో జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామానికి చెందిన మనసా (35) , అదే జిల్లాకు చెందిన అరుణ్ తేజను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది . వృత్తిరీత్యా భార్యాభర్తలు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావడంతో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్ళు సాఫీగా సాగిన వారి వైవాహిక జీవితంలో పిల్లలు కలుగాకపోవడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. అవి గొడవలకు దారీతియ్యడంతో ఇరువురు విడాకులు తీసుకొనేందుకు సిద్ధమై కోర్టును ఆశ్రయించారు. భర్త అరుణ్ తేజ్ కు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనసా హైదరాబాద్ కు చేరుకుంది.

కొండాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటుంది. పిల్లలు కలుగాకపోవడం, భర్తకు దూరం అవ్వడంతో ఆ మహిళ మానసికంగా కుంగిపోయింది.  సోమవారం అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కరెంట్ బిల్లు ఇవ్వడానికి ఫ్లాట్ వద్దకు వచ్చిన వాచ్ మెన్ డోర్ కొట్టినా.. ఎంతసేపటికి తియ్యకపోవడంతో ఫ్లాట్ ఓనర్ కు సమాచారం ఇచ్చాడు. సోమవారం రాత్రి  ఓనర్ దగ్గర ఉన్న మరో కీ తో డోర్ ఓపెన్ చేసి చూడగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు మహిళ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత  డెడ్ బాడీని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.