శశి థరూర్ కు ఊరట.. భార్య మృతి కేసులో క్లీన్ చిట్

శశి థరూర్ కు ఊరట.. భార్య మృతి కేసులో క్లీన్ చిట్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్‌కు ఊరట ల‌భించింది. భార్య సునందా పుష్క‌ర్ అనుమానాస్ప‌ద మృతి కేసులో శ‌శిథ‌రూర్‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. స్పెష‌ల్ జ‌డ్జి గీతాంజ‌లి గోయ‌ల్ ఈ తీర్పును వెలువ‌రించారు. కోర్టుకు బాండ్లు స‌మ‌ర్పించాల‌ని న్యాయ‌మూర్తి త‌న తీర్పులో ఎంపీ థరూర్ ను ఆదేశించారు. కోర్టు తీర్పు త‌ర్వాత శ‌శి థ‌రూర్ స్పందించారు. ఏడున్నరేళ్ల పాటు త‌న‌ను దారుణంగా వేధించారని అన్నారు. కాగా, సునందా పుష్క‌ర్ 2014, జ‌న‌వ‌రి 7వ తేదిన అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు. ఈ కేసులో విచారణ జరిపిన ఢిల్లీ పోలీసులు.. శశి థరూర్ పై మర్డర్, ఆత్మహత్యాయత్నం కేసులు న‌మోదు చేసి విచారించారు. ఈ కేసులో శశి థ‌రూర్ త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ వికాశ్ పాహ్వా వాదించారు.