హైదరాబాద్‌‌తో పెట్టుకుంటే ఫసక్..పంజాబ్ ఓటమిపై ఫుల్ మీమ్స్

హైదరాబాద్‌‌తో పెట్టుకుంటే ఫసక్..పంజాబ్ ఓటమిపై ఫుల్ మీమ్స్

ఐపీఎల్ 13 సీజన్ లో మ్యాచ్ లు మంచి కిక్కు ఇస్తున్న విషయం తెలిసిందే. సస్పెన్స్.. థ్రిల్లింగ్స్ తో సాగుతున్నాయి. ఈజీగా గెలుస్తున్నాయనుకున్న ఫేవరేట్ మ్యాచ్ లు ఓడుతున్నాయి. మంచి ప్లేయర్లు తుస్సు మంటున్నారు. ఆడలేనివారు జోరు చూపిస్తూ.. ఓడిపోయే మ్యాచ్ లను గెలిపిస్తున్నారు. అయితే ప్రతి మ్యాచ్ కు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ , మీమ్స్ ఇప్పుడు కామన్ అయ్యింది. మీమ్స్ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్లు. మ్యాచ్‌‌ను గెలిస్తే ఎలా ఆకాశానికి ఎత్తుకుంటున్నారో.. ఓడితే .. అంతే ఘోరంగా విమర్శిస్తున్నారు. గురువారం పంజాబ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో హైదరాబాద్ బిగ్ విక్టరీ సాధించింది. అయితే.. 3 ఓటముల తర్వాత గెలుస్తుందా.. లేదా అనుకున్న మ్యాచ్ భారీ విజయంతో విక్టరీని తన ఖాతోలో వేసుకోవడంతో.. ఫ్యాన్స్ మీమ్స్ చేస్తూ సన్ రైజర్స్‌‌కు మద్దతు తెలుపుతున్నారు.

హైదరాబాద్ టీమ్‌‌లో మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్ గాయాలతో దూరం అయ్యారు. దీంతో టీమ్ ఎలా రాణిస్తుందోనని కంగారుపడ్డ ఫ్యాన్స్‌‌కు.. ఈ మ్యాచ్ మంచి కిక్కిచ్చింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ చెలరేగడంతో హైదరాబాద్ 201 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌లో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 132కే ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్ల మాయాజాలానికి ఒక్క నికోలస్ పూరన్ తప్ప ఎవ్వరూ రాణించలేక పోయారు. దీంతో హైదరాబాద్ ను తక్కువ అంచన వేయకూడదంటూ సోషల్ మీడియాలో మీమ్స్ చేశారు. హీరో వెంకటేష్, ప్రీతీజింతా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలోని కామెడీ సీన్ ఎక్కువగా వైరల్ అవుతోంది. వాట్స్‌‌ప్ స్టేటస్‌లో పెట్టుకుంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్.