వార్సా: గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన సూపర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 36 పాయింట్లకు గానూ 17 పాయింట్లు సాధించాడు. ర్యాపిడ్‌లో 9, బ్లిట్జ్‌లో 8 పాయింట్లు నెగ్గాడు. టోర్నీ ఆరంభం నుంచి మిశ్రమ ఫలితాలతో కొనసాగిన గుకేశ్.. చివరి రౌండ్లలో వెస్లీ సో, నీమన్, డాడా జాన్ క్రిస్టోఫ్‌పై గెలిచాడు.
అయితే సిందరోవ్‌తో జరిగిన మూడు గేమ్‌ల్లో రెండింటిలో ఓడటం గుకేశ్ ర్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా గ్రాండ్ మాస్టర్ హాన్స్ నీమన్ (22.5) టాప్ ప్లేస్‌తో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫ్యాబియానో కరువాన (22), వెస్లీ సో (21), వ్లాదిమిర్ ఫెడోసీవ్ (18), ఫిరోజా అలీరెజా (17.5) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు.
