స్కూల్ స్టూడెంట్ల కోసం 12 స్వయంప్రభ చానళ్లు

స్కూల్ స్టూడెంట్ల కోసం 12 స్వయంప్రభ చానళ్లు
  • విద్యారంగంలో ఆన్​లైన్ ఎడ్యుకేషన్​కు ప్రోత్సాహం
  • ఆన్ లైన్ క్లాసులకు 100 వర్సిటీలకు పర్మిషన్
  • ఫస్టు క్లాస్ నుంచి 12 వరకు ప్రతి తరగతికి ఒక చానల్

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం దృష్ట్యా స్టూడెంట్ల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కు భారీ ప్రోత్సాహం అందజేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్యారంగంలో మరో 12 స్వయం ప్రభ డీటీహెచ్ చానళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. పాడ్​కాస్ట్, రేడియోలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా దృష్టి.. వినికిడి లోపం ఉన్న స్టూడెంట్ల కోసం ప్రత్యేక ఈ–కంటెంట్ విధానం రూపొందిస్తామన్నారు. ఇతర విద్యార్థుల కోసం ఈ నెలాఖరు నాటికి ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించేందుకు దేశంలోని 100 యూనివర్సిటీలకు ఆటోమేటిక్ విధానంలో పర్మిషన్లు ఇస్తామని చెప్పారు.

ఒక్కో తరగతికి ఒక్కో చానెల్
ఆదివారం ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. స్వయం ప్రభ డీటీహెచ్ చానల్ ద్వారా ప్రతిరోజు నాలుగు 4 గంటల పాటు పిల్లలకు క్లాసులు బొధిస్తామన్నారు. స్కూల్స్ డిజిటలైజేషన్ కి అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. ఈ–స్కూల్​లో 200 కొత్త పుస్తకాలు అందుబాటు లో ఉంచుతామన్నారు. ఇప్పటికే స్వయం ప్రభ 3 ఛానల్స్ ద్వారా ఆన్​లైన్ క్లాసులు చెప్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత స్టూడెంట్ల కోసం మరో 12 చానల్స్ ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 1 నుంచి 12 వ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి ప్రత్యేకంగా ఒక్కో చానల్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ విద్య అందిస్తామన్నారు. టాటా స్కై, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్ల సాయంతో ఆన్ లైన్ లో వీడియో క్లాసులు బోధిస్తామని చెప్పారు. క్లాసులు స్టార్ట్ కావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భయాందోళనలు దూరం చేసేందుకు కౌన్సెలింగ్ తరగతులు చెప్పిస్తామన్నారు.