
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’(Baahubali Crown of Blood) అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) పోస్ట్ చేసిన విషయం తెలిసింది. తాజాగా బాహుబలి సీరీస్కు ముందు జరిగిన కథతో రాబోతున్న ఈ ప్రీక్వెల్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
బాహుబలి, బాహుబలి 2 కథలు చెప్పని కథను..ఇపుడు చూపించబోతున్న ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే, ఈ స్టోరీలో కూడా కట్టప్పను ప్రధాన విలన్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.రక్తదేవ్ అనే శతృ సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్న కట్టప్పను ఓడించడానికి బాహుబలి, భల్లాలదేవ ఇద్దరు ఒకటై..ఒక సమరంగా చేతులు కలుపుతూ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
అలాగే..మాహిష్మతి సామ్రాజ్యానికి ఇప్పుడు కల్పిత సామ్రాజ్యంగా చూపించిన ఈ సరికొత్త రాజ్యంలో ఉన్న మహా శత్రువు పేరు రక్తదేవ్. అతని రాజ్యంలో ఉన్న సైన్యానికి ముఖ్య సేనాధిపతి కట్టప్ప. ఇక బాహుబలి, బాహుబలి 2 లో తమకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిపైనే..మన సైన్యం ఎలా గెలుస్తుందంటూ ఆలోచనతో నేరుగా బాహుబలి, భల్లాలదేవే రంగంలోకి దిగుతారు. ఈ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెరకెక్కించిన ఈ యానిమేషన్ సిరీస్ హాట్‌స్టార్ లో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆ బాహుబలికి దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్టర్ కాగా..ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యాక్షన్ సీరీస్ కి అతడు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ కి జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ డైరెక్ట్ చేశారు. మాహిష్మతి సామ్రాజ్యానికి తన పూర్తి జీవితాన్ని అంకితమిచ్చిన కట్టప్పే..ఈ సరికొత్త కథలో అదే మాహిష్మతిపై పోరాటం చేయడం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రావడం ఆడియన్స్ లో ఫుల్ జోష్ ఇస్తుంది.
ఏదేమైనా బాహుబలి, కట్టప్ప, శివగామి, భల్లాలదేవ, దేవసేన పాత్రలు ఇందులో ఎలా ఉండబోతున్నాయి.? ఇంకా ఏవైనా కొత్త పాత్రలు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అనే పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Mahishmati ke khoon se likhi ek nayi kahani ?
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 2, 2024
Hotstar Specials S.S. Rajamouli’s Baahubali : Crown of Blood streaming from 17th May.#BaahubaliOnHotstar pic.twitter.com/43mwjsGfZS