చెమట వాసనకి చెక్ పెట్టండిలా..

చెమట వాసనకి చెక్ పెట్టండిలా..

వేసవిలో అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్య చెమట. చెమటతో పాటు శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది.ఇదింకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అందుకే చాలా మంది ఫ్రెష్​నెస్​ కోసం మార్కెట్​లో దొరికే డియోడరెంట్లు, పర్​ఫ్యూమ్స్​ వాడుతుంటారు. అయితే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా ఈ చెమట వాసనకి చెక్​పెట్టొచ్చు. అవేంటంటే..

బేకింగ్‌‌సోడా

ఒక టీ స్పూన్​ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. బేకింగ్ సోడా తడిని పీల్చేయడమే కాదు, బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది.

టొమాటో

నీళ్లలో టొమాటో రసాన్ని  కలుపుకుని స్నానం చేస్తే చెమట వాసన రాదు. లేదంటే  ఆ రసాన్ని దుర్వాసన వచ్చే చోట్ల రాసుకున్నా సమస్య తీరుతుంది. ముల్లంగి రసంలో గ్లిజరిన్​ కలిపి ఉపయోగించినా సరిపోతుంది.

నిమ్మకాయ

చెమట వాసనకు చెక్​ పెట్టడానికి నిమ్మకాయ బెస్ట్​ ఆప్షన్​. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, వాటితో అండర్​ ఆర్మ్స్​లో రుద్ది పదినిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. వేడినీళ్లలో నిమ్మరసం కలిపి, అందులో దూది ముంచి రుద్దుకున్నా దుర్వాసన రాదు.

గ్రీన్‌‌టీ

గ్రీన్​టీలో ఉండే టానిన్లు చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. చెమట, దుర్వాసన లాంటి సమస్యలను నివారిస్తాయి. ఒక లీటర్​ వేడి నీళ్లలో రెండు గ్రీన్​ టీ బ్యాగులను పది నిమిషాలు ఉంచి తీసేయాలి.  ఆ నీళ్లని డైరెక్ట్​గా చెమటపట్టే భాగాల్లో అప్లై చేస్తే దుర్వాసన పోతుంది.

రోజ్​మేరీ

రోజ్​మేరీ ఆకులతో కూడా చెమట వాసనకి చెక్​ పెట్టొచ్చు. . రోజూ స్నానం చేసే నీళ్లలో ఆకుల రసాన్ని  పోసి.. పది నిమిషాల తర్వాత  స్నానం చేస్తే సరిపోతుంది.

హైడ్రోజన్​ పెరాక్సైడ్​

వాడేసిన టీపొడిని అండర్​ ఆర్మ్స్​లో బాగా రుద్దుకని  పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే  దుర్వాసన రాదు. లేదంటే నీళ్లలో టీ పొడి వేసి మరిగించి, వడకట్టి, అందులో నిమ్మరసం కలపాలి. అలాగే ఓ కప్పు నీళ్లలో ఒక టీ స్పూన్​ హైడ్రోజన్​ పెరాక్సైడ్​ వేసి బాగా కలపాలి. ఓ శుభ్రమైన క్లాత్​ని ఈ మిశ్రమంలో ముంచి అండర్​ ఆర్మ్స్​లో రాయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే దుర్వాసన పోతుంది.

టీట్రీ ఆయిల్స్​

చెమట ఎక్కువగా ఉన్న చోట టీట్రీ ఆయిల్​తో శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే నేచురల్​ యాంటీ సెప్టిక్స్​ ఉపయోగించడం వల్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియా పోతుంది. టాల్కమ్​ పౌడర్​ను ఉపయోగించడం
వల్ల  కూడా మంచి ఫలితం ఉంటుంది.