
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లు పెద్దిరెడ్డిని కలిశారు. దీంతో బీజేపీలో చేరేదందుకు పెద్దిరెడ్డి అగీకరించారు. ఒకటి, రెండ్రోజుల్లో బీజేపీలో చేరనున్నారు పెద్దిరెడ్డి. రెండుసార్లు (1994, 99) హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి.. కార్మిక నాయకుడికిగా పేరు సంపాదించుకున్న పెద్దిరెడ్డి.. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. కాగా, ఇప్పటికే పెద్దిరెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.