టీ20 వరల్డ్ కప్ థీమ్ సాంగ్ విడుదల

V6 Velugu Posted on Sep 23, 2021

  • బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది స్వరాలు
  • అక్టోబర్ 17 నంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్

టీ20 వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ను ఐసీసీ విడుదల చేసింది. ఒకవైపు ఐపీఎల్‌ సమరం కొనసాగుతుండగానే టీ20 ప్రపంచకప్‌ అథికారిక గీతాన్ని విడుదల చేసింది ఐసీసీ. వచ్చే నెల  17 నుంచి నవంబర్‌ 14 వరకు యూఏఈ, ఓమన్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ పోటీలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. 
‘లైవ్‌ ద గేమ్‌.. లవ్‌ ద గేమ్’ థీమ్‌తో రూపొందిన ఈ పాటను బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది కంపోజ్‌ చేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టీ20 ఛాంపియన్‌ విండీస్‌ సారథి పొలార్డ్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అఫ్గానిస్థాన్‌ కీలక ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ‘అవతార్‌’ యానిమేషన్ క్యారెక్టర్లతో గ్రౌండ్ లోకి దూసుకెళుతూ.. టీ20 ప్రపంచకప్ కోసం తలపడుతున్నట్లు ఈ వీడియోలో కన్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి..

 

Tagged ICC T20, T20 World Cup, , T20 theme theme song, t20 world cup theme song, t20 world cup Anthem video, Twenty20 WC theme song, Live the game

Latest Videos

Subscribe Now

More News