భారీగా పెరిగిన టాటా స్కై సెట్ టాప్ బాక్సుల ధర

భారీగా పెరిగిన టాటా స్కై సెట్ టాప్ బాక్సుల ధర

సెట్ టాప్ బాక్సుల ధరలను భారీగా పెంచింది టాటా స్కై. SD, HD సెట్ టాప్ బాక్స్ లపై 200 నుంచి 300 రూపాయలను పెంచినట్లు సోమవారం తెలిపింది టాటా స్కై సంస్థ. SD సెట్ బాక్స్ ధర రూ. 1099 ఉండగా.. రూ.300 పెంచడంతో ప్రస్తుతం దీని ధర రూ.1399గా ఉంది. అలాగే HD సెట్‌ టాప్‌ బాక్స్‌ ధర రూ.1299 ఉండగా రూ.200 పెరిగింది. దీంతో ఈ బాక్స్‌ను రూ.1499 ధరకు అమ్ముతున్నారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ఈ బాక్సుల ధరలను టాటా స్కై తగ్గించగా.. ఇప్పుడు పెంచింది.

ఈ క్రమంలో పెరిగిన ధరల ప్రకారం ఈ బాక్సులను విక్రయిస్తున్నారు. టాటా స్కైకి చెందిన 4కె సెట్‌ టాప్‌ బాక్స్‌ ధర రూ.6400 ఉండగా, HD  బాక్స్‌ ప్లస్‌ రికార్డర్‌ ధర రూ.9,300గా ఉంది. అయితే స్టాండర్డ్‌, HD సెట్‌ టాప్‌ బాక్సుల ధరల మధ్య డిఫరెంట్ రూ.100 మాత్రమే ఉండడంతో చాలా మంది HD సెట్‌ టాప్‌ బాక్సులనే కొనుగోలు చేస్తారని తెలిపింది టాటా స్కై.