క్లాస్ రూమ్ లో మొబైల్ కనిపిస్తే కఠిన చర్యలే..

క్లాస్ రూమ్ లో మొబైల్ కనిపిస్తే కఠిన చర్యలే..

స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడ్డ విద్యార్థులు..క్లాస్ రూమ్స్ కి కూడా తీసుకెళ్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఫోన్లకు దూరంగా ఉండాలంటున్నారు టీచర్లు. ఈ క్రమమంలోనే ఎవరైన విద్యార్థులు మొబైల్ తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది రాజస్థాన్ ప్రభుత్వం. దీనిపై గురువారం రాజస్థాన్‌ లోని బికనేర్ జిల్లా ప్రభుత్వ ఉన్నత విద్యాధికారులు.. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు హెచ్చరికలు జారీ చేశారు. క్లాస్ రూమ్స్ లోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరించారు.

క్లాస్ రూంలోకి వెళ్లే కంటే ముందు ఆఫీస్‌ లో తమ ఫోన్లను సమర్పించి వెళ్లాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రూల్ నే ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీచర్లు కూడా క్లాస్ రూమ్ లో ఫోన్ మాట్లాడుతున్నారని, అది తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాధికారులు తెలిపారు.  క్లాస్ రూంలో మొబైల్స్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల చదువుకునే వాతావరణానికి భంగం కలుగుతుందన్నారు.