మీటింగ్ చూసి సీఎం కేసీఆర్ భయపడ్డాడు

మీటింగ్ చూసి సీఎం కేసీఆర్ భయపడ్డాడు

మునుగోడు నియోజకవర్గంలో ఓటుకు రూ. 30 వేలు ఇవ్వాలని సీఎం కేసిఆర్ చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్, దుబ్బాకలో ఓటర్లకు పైసలు ఇచ్చి గెలవాలని చూశారు.. కానీ ప్రజలు తమ పార్టీకి ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ లో జాయిన్ కావాలంటే పైసలు కావాలి.. రాజకీయాలు అంటే పైసలు కావన్నారు. రాష్ట్రంలో స్వార్థంగా సేవ చేసేది బీజేపీయేనని, తమ పార్టీలో జాయిన్ అయ్యే వారు సేవ కోసం వస్తారన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా.. నిర్వహించిన మీటింగ్ చూసి సీఎం కేసీఆర్ భయపడ్డాడన్నారు. స్వచ్చందంగా జనాలు తమ సభలకు వస్తుంటే.. టీఆర్ఎస్ మీటింగ్ కు రూ. 1000 ఇచ్చినా ఎవ్వరూ వస్తలేరన్నారు. పెట్టుబడులకు విదేశాలకు తేవడానికి సీఎం కేసీఆర్ కుటుంబం వెళ్లలేదని చెప్పారు. అక్రమంగా సంపాదించిన పైసలు అక్కడ దాచుకోవడానికి వెళుతున్నారని విమర్శించారు. దేశం గురించి చులకనగా మాట్లాడే వారితో కఠినంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ పక్క దేశాల మీద ప్రేమ కురిపిస్తున్నాడని, చివరకు ఆయన కుటుంబం మద్యాన్ని కూడా వదలలేదని విమర్శించారు.