అత్యాచారం కేసులో పదేళ్ల జైలు

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు

ఆసిఫాబాద్​, వెలుగు: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 జులై 23న జైనూర్​ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (14)కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడో వ్యక్తి. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. పొలంలో పడి ఉన్న ఆమెను చూసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. జరిగిన విషయం ఆ అమ్మాయి చెప్పడంతో జైనూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. అదనపు పీపీ రమణారెడ్డి 16 మంది సాక్షులను కోర్ఉలో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన జిల్లా అదనపు కోర్టు జడ్జి జస్టిస్​ టి. శ్రీనివాస్​రావు బుధవారం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. రూ.500 జరిమానా వేశారు. బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందజేయాల్సిందిగా జిల్లా లీగల్​ సర్వీస్​ అథారిటీని ఆదేశించారు.