పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను పాస్ చేస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నిర్ణయం

పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను పాస్ చేస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నిర్ణయం

ఏపీ విద్యాశాఖ మ‌రో కీల‌క నిర్ణ‌య తీసుకుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా .. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను పాస్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మేర‌కు ఓ పత్రికా ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనా మ‌హామ్మారి నేప‌థ్యంలో విద్యార్దులు , వారి త‌ల్లిదండ్రుల‌తో పాటు ప్ర‌జా ప్ర‌తినిధుల విన్న‌పాల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. ఇంట‌ర్మీడియ‌ట్ మార్చి 2020 ప‌రీక్ష‌ల‌కి ఎవ‌రైతే ప‌రీక్షా ఫీజు చెల్లించారో వారంద‌ర్నీ ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. లాక్‌డౌన్, కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల హాజ‌రుకాని విద్యార్దులు మ‌రియు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడి జులై 2020లో ప‌రీక్ష‌లు రాయాల్సిన కంపార్ట్మెంట్ విద్యార్థులను కూడా పాస్ చేస్తున్న‌ట్టు తెలిపారు. పాస్ అయిన వారి మార్కుల మెమోలను బుధవారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.