కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ 2024 లోక సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె మంగళవారం నామినేషన్ వేశారు. అందులో ఆమె ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, దాంతోపాటు ఆస్థుల వివరాలు తెలిపింది.  స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆమెకు రూ.17 కోట్ల అప్పు ఉందని, BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ ఉన్నాయి. 

ప్రస్తుతం రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్  ఆమె దగ్గర ఉన్నట్లు కంగనా తెలిపింది. అంతే కాదు 8 క్రిమినల్ కేసులు ఆమె పేరు మీద పెండింగ్ ఉన్నాయి. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొంది.